歌词

ఓ బంగారం, నీ చెయ్యే తాకగానే
ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం కన్నెత్తి చూడగానే
నిద్దర్లే మానేసె జాగారం

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
పుట్టాక ఇంతానందం చూడలేదే
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే

నువు పక్కనుంటే చాలే
మత్తు ఎక్కి తూలే
మాయదారి మనసే
మరి నిన్ను తాకే గాలే
నన్ను తాకుతుంటే
ఆదమరుపిపుడే ఎగిసే

నీ చూపు వలపే చేపలాగ దొరికే
నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
నడిచి నడిచి ఆగి ఆగేలా

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
దిల్ రూబ మోగిందే నాలోనా

నీ పేరు పిలిచే అస్తమానం తలచే
నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

Writer(s): Chaitan Bharadwaj, Bhaskarabhatla

API Calls

从 Spotify 记录音乐?

将您的 Spotify 帐户连接到您的 Last.fm 帐户,通过任何设备或平台上的任何 Spotify 应用记录您所听的一切内容。

连接到 Spotify

关闭