నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీ-వరుని
చరణములు
1.దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీతా-రాఘవుని
2.సుజ్ఞాన నిధిని సోమ-సూర్య లోచనుని
అజ్ఞాన-తమమునణచు భాస్కరుని
3.నిర్మలాకారుని నిఖిలాఘ-హరుని
ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని
4.బోధతో పలుమారు పూజించి నే
నారాధింతు శ్రీ త్యాగరాజ-సన్నుతుని